నారద వర్తమాన సమాచారం
సాయంత్రం ఆరు తర్వాత అంతా గప్ చుప్…
రాష్ట్రంలో గత రెండు నెల రోజులుగా మారుమోగుతున్న మైకులు మూగబోనున్నాయి.
పార్టీ అభ్యర్థులతో హోరెత్తిన ప్రచారం… ముగింపు దశకు చేరుకుంది. ర్యాలీలు, సభలు, అభిమాన నేతలను కీర్తిస్తూ పాడిన పాటలు, నినాదాలు… సాయంత్రం 6గంటల తర్వాత ఇక వినిపించవు.
ఎన్నికల ప్రచారానికి ఇవాళే చివరి రోజు కావడం… సాయంత్రం 6గంటల వరకే ప్రచారానికి గడువు ఉండటంతో… రాజకీయ పార్టీల నేతలు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రచారానికి ఇంకొన్ని గంటలే సమయం ఉండటంతో… ఓటర్ల దగ్గరకు వెళ్లి… తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సాయంత్రం లోపే ప్రచారం ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
సాయంత్రం 6గంటల తర్వాత సభలు, సమావేశాలు పెట్టకూడదని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు… ప్రచార సమయం ముగిసిన తర్వాత స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండేందుకు వీలులేదని ఆదేశించారు. ప్రచారం కోసం బయటి నుంచి నియోజకవర్గాలకు వచ్చిన వారంతా వెళ్లిపోవాలని తెలిపింది.
రాజకీయ పార్టీలు నియమించుకున్న రాష్ట్ర ఇంఛార్జ్‌లు.. పార్టీ కార్యాలయాల్లోనే ఉండాలి. ఆఫీసు దాటి బయటకు రావొద్దని ఈసీ స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6గంటలకు ప్రచారం ముగుస్తుండగా… సమస్యాత్మక ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో అయితే సాయంత్రం 5గంటలకే ప్రచారానికి సమయం ఇచ్చారు.
అలాగే… అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే ప్రచారం పూర్తవుతుంది.
నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎల్లుండి (మే 13) పోలింగ్ జరగనుంది.
ఈ 48 గంటల సయమంలో…
ఓటర్లను ఏ విధంగానూ ప్రలోభాలాలకు గురిచేయకుండా ఈసీ చర్యలు తీసుకుంటోంది.
బల్క్ మెసేజ్‌లపై నిషేధం విధించింది. సినిమా, టెలివిజన్ లేదా.. మరేదైన మార్గం ద్వారాను ప్రచారం నిర్వహించకూడదని స్పష్టంగా తెలిపింది.
ఎన్నికల ప్రచారం ముగియడమే కాదు.. మద్యం షాపులను కూడా సాయంత్రం 6గంటల నుంచి మూసివేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.