కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే15
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పౌరసరఫరాల, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో తో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిలువలు లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు దాన్యమును రైస్ మిల్లులకు లారీల్లో తరలించి రైస్ మిల్ యజమానులు అన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన వెంటనే రైతుకు సంబంధించిన సమగ్ర వివరాలు ట్యాబ్ లో ఎంట్రీ చేయాలని చెప్పారు. పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలు రైతులు అందించే విధంగా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యంను బాయిల్డ్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం ను తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని, లారీల సంఖ్య పెంచాలని, ఈ మేరకు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ట్యాబ్ ఎంట్రీ చేయాలని, రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వెంట వెంటనే పడేలా చూడాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు , ఇంచార్జ్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.