నారద వర్తమాన సమాచారం
మే :16
నేషనలిస్ట్ జనశక్తి పార్టీ అభ్యర్థి ఏలూరు వెంకట రమణ పంతులు పెందుర్తి నియోజకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు
తన విజయానికి ఓట్ల ద్వారా మద్దతు తెలియచేసిన వారికి కృతజ్ఞతలు
పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ నేషనలిస్ట్ శక్తి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ఏలూరు వెంకటరమణ
పెందుర్తి, న్యూస్: పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం
అభివృద్ధి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటానని, తన రాజకీయం పూర్తిస్థాయిలో కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పెందుర్తి నియోజకవర్గ నేషనలిస్ట్ జనశక్తి పార్టీ అభ్యర్థి ఏలూరు వెంకటరమణ స్పష్టం చేశారు. తన విజయం కోసం ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గెలుపు ఓటంలో రాజకీయాల్లో సర్వసాధారణమని గెలిచిన వారే ప్రజలకు సేవ చేస్తారని అనుకోవడం కరెక్ట్ కాదని, గెలుపొందిన వారు తమ వ్యాపార వాణిజ్య వ్యక్తిగత పనులపై ఎప్పుడూ బిజీగా ఉంటూ ఎన్నికల్లో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారన్న విషయం ప్రతి ఒక్క ఓటరుకు తెలుసన్నారు. తాను ఆ విధంగా కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అభివృద్ధి పనులు చేపట్టడంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానంగా ఉంటానని రాజేష్ పంతులు పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ పంచ గ్రామాల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి దానికోసం పోరాటం చేస్తున్న ప్రజలకు సంఘీభావంగా తాను కూడా పోరాటం చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. తాను గెలుపొందడానికి పూర్తిస్థాయిలో ప్రజల సహకరిస్తారని, సహకరించి ఉంటారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రతి పనిని పూర్తి చేసి పెందుర్తి నియోజకవర్గం తీర్చిదిద్దుతానని తెలియజేశారు.ఏది ఏమైనా పెందుర్తి ప్రజలు ఎంతో విజ్ఞులని వారు పెందుర్తి అభివృద్ధి చేసే వారికే ఓటు వేసి గెలిపిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందరికీ సక్రమంగా చేరే విధంగా పాటుపడతానని చెప్పారు. అలాగే పరవాడ మండలంలో గల “తాడి” గ్రామం సమస్య పరిష్కరించి కాలుష్య రహిత ప్రాంతానికి ఆ గ్రామ ప్రజలను తరలించడంలో ముఖ్యపాత్ర పోషిస్తానని, ప్రజాప్రతినిధులతో సహకరించి ప్రభుత్వ దృష్టికి సమస్యను పూర్తిస్థాయిలో తీసుకువెళ్లి ఈ సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా పెందుర్తిలో డిగ్రీ కాలేజీ, ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు నూతనంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేసి వాటిని ఏర్పాటుకు కూడా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం ఏర్పాటు కావాలని అందుచేత జూన్ 4వ తేదీ వరకు ప్రజలు ఓపిగ్గా ఉండాలని, నూతనంగా ఏర్పాటు అయిన ప్రభుత్వ దృష్టికి పెందుర్తి నియోజకవర్గ సమస్యలు తీసుకువెళ్లి తద్వారా వాటి సమస్యలను ఈ ఐదు సంవత్సరాలలో పరిష్కరించడానికి తనవంతు పాత్రపోషిస్తానని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ అభ్యర్థి ఏలూరు వెంకట రమణ పంతులు పేర్కొన్నారు. అదే కాక పురోహితుల సమస్యలు మరియు ఇతర కమ్యూనిటీ సమస్యలు కూడా తీరుస్తారని బ్రాహ్మణులకు అర్చకులకు పురోహితులకు బ్రాహ్మణ భవనాలను నిర్మిస్తామని చాలీచాలని జీతాలతోటి అష్ట కష్టాలు పడుతున్న వారిని పైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఎన్నో ఆలోచనలు చేస్తున్నానని తెలియజేయడం జరుగుతున్నది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.