
నారద వర్తమాన సమాచారం
అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు జారీ
హైదరాబాద్
: మే 18
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టిన పనుల పురోగతి, వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్షించారు. దాంతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం పనులు వేగవంతం చేసి పూర్తి చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి అభినందించారు. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు పునఃప్రారంభ మయ్యే తేదీ జూన్ 12 లోగా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రం వ్యాప్తంగా తెరిచే రోజున ప్రతి విద్యార్ధికి నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్త కాలు, ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్లను ఆదేశించారు.
చిన్నపాటి మరమ్మతు పనులు, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్ పనులు నాణ్యత గా జరిగేలా పర్యవేక్షించా లని అధికారులను ఆమె ఆదేశించారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







