నారద వర్తమాన సమాచారం
అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ స్మారక దినోత్సవాన్ని నిర్వహించిన జన జాగృతి పి యు – పెనుకొండ సంస్థ వారు
తేది : 19 మే, 2024
ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టరు మరియు శ్రీ సత్యసాయి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం ఆధ్వర్యంలో జన జాగృతి పి. యూ – పెనుకొండ స్వచ్చంద సంస్థ వారు అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ స్మారక దినంను కొత్తచెరువు మండలం కేంద్రం నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జన జాగృతి ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ తో చనిపోయిన వారిని మనం గుర్తు చేసుకుంటూ వారి పట్ల ప్రేమ మరియు సంఘీభావం తెలియచేద్దాం,
వారి కుటుంబ సభ్యుల బాధను నయం చేద్దాం…అని తెలియజేసారు. అదేవిధంగా
హెచ్.ఐ.వి సోకి మరణించిన వారిని స్మరించుకొని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ లైట్ డే ను నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు.ఈ సందర్బంగా హెచ్.ఐ.వి సోకిన వ్యక్తులను వివక్షకు గురిచేయరాదని తెలియజేసారు, అదేవిధంగా యువతకు హెచ్.ఐ.వి గురించి అవగాహన లేకపోవడం సామాజిక మాధ్యమాలు, చెడు సహవాసాల కారణంగా హెచ్.ఐ.వి కి గురి అవుతారనిహెచ్.ఐ.వి./ ఎయిడ్స్ గురించి తెలియజేస్తూ హెచ్.ఐ.వి. కేవలం 4 రకాలుగా సంక్రమిస్తుంది . సురక్షతంకానీ లైంగిక సంబంధాల ద్వారా,
కలుషిత సూదులు సిరంజీల ద్వారా,
. కలుషిత రక్త మార్పిడి ద్వారా,
హెచ్.ఐ.వి. సోకిన తల్లి నుండి బిడ్డకు వస్తుందని చెప్పారు.
అలాగే హెచ్.ఐ.వి. వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రతలు మరియు, హెచ్.ఐ.వి. ఉన్న గర్భిణీ స్త్రీల నుండి పుట్టబోయే బిడ్డలకు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగించారు .అనంతరం కాండిలైట్స్ తో ప్రదర్శనగావిస్తూ సంఘీభావం తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో జన జాగృతి సిబ్బంది ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు,ఓ ఆర్ డబ్య్లూ లు నీలావతి, రామాంజినమ్మ, శశికళ, పద్మావతి, చంద్రకళ,పి ఈ లు అందరూ, కమ్యూనిటీ మహిళలు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.