నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ…
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి: మే23
• పెండింగ్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి డిఎస్‌పి, సిఐలను, ఎస్ఐలను అడిగి కేసు ఫైల్స్ ను పరిశీలించడం జరిగినది.
• అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన కేసులలో ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి.
• పాత నేరస్తులు,రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి
• గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, పేకాట, జూదం, తదితర వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కు పాదంతో అణిచివేయాలి అని సూచించార.
• నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ సింధుశర్మ, జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ – సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా,క్రికెట్ బెట్టింగులు, జూదం,మట్కా అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ప్రభుత్వ నిషేధిత గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. .జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.దొంగతనం కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు…ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్),వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు.ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మద్యం సేవించి వాహనాలను నడుపుతూ,ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్‌పి సూచించారు.విధులలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని గుర్తించి వారికి ఎస్‌పి అవార్డులు అందజేయడం జరిగింది వారిలో 1. ఎన్. శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిసిఎస్, 2. ఎండి ఉస్మాన్ ఎస్సై సిసిఎస్, 3.యం. మహేందర్ ఎస్సై , 4. సుబాష్ గౌడ్ ఎస్సై, డిఎస్బి కామారెడ్డి 5. సయ్యదుద్దీన్, 6. సురేందర్, 7. కిషన్ సిసిఎస్ హెడ్ కానిస్టేబుళ్లు, 8. మైసయ్య, 9 . శ్రావణ్ కుమార్, 10 . రాజేంద్రకుమార్, 11 . గణపతి, 12 . శ్రీనివాస్ సిసిఎస్ కానిస్టేబుళ్లు, 13. శ్రీనివాస్, 14. వెంకట్ రాములు బిక్నూర్ పిఎస్, 15. శ్రీనివాస్ పీసీ, 16 . సుప్రజా ఉమెన్ పీసీ యెల్లారెడ్డి షి టీం, 17 . రవి సదాశివనగర్ పియస్ ,18. జి శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ ఐటీ కోర్ టీం, 19. మహేందర్ పిసి, ఐటీ కోర్ టీం, 20. సంతోష్ డిసిఆర్, 21 బుచ్చయ్య పీసీ, 22 తిరుపతి పీసీ, 23 సాయిబాబా పీసీ, 24. వసి పీసీ, 2. కిషన్ కోర్టు పీసీ, 26. నరేశ్ హెజీ గార్లకు అవార్డులతో పాటు అభినందించడం జరిగింది.
ఈ సమావేశంలో ట్రైనింగ్ ఐపీఎస్ కాజోల్ సింగ్, డిఎస్‌పిలు నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ తిరుపయ్య , డిసిఆర్‌బి ఇన్స్పెక్టర్ మురళి , సీఐలు,ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.