నారద వర్తమాన సమాచారం
మే :24
రికార్డులు మార్చి భూములు దోపిడీ చేస్తున్న వైకాపా నేతలు: ప్రత్తిపాటి
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల తారుమారుతో వైకాపా నాయకులు సాగిస్తున్న భూదోపిడీ ప్రమాదకర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది, అధికారులను బెదిరించి, అధికార బలం ఉపయోగించి భయపెట్టి అయిదేళ్లుగా సాగిస్తున్న ఆ అరాచకాలు తీవ్రస్థాయికి చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డుస్థాయి పోలింగ్‌తో ఓటమి ఖాయమైన నేపథ్యంలో ఇటీవల వైకాపా బూచోళ్ల భూముల లూటీ మరింత పెరిగందన్నారాయన. రాష్ట్రం మొత్తం మీద భూముల కబ్జాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులపై కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇటీవలి హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వైకాపా నేతల తీరుపై తూర్పార బట్టారు ప్రత్తిపాటి. రెవెన్యూ సిబ్బంది సాయంతో వెబ్‌ల్యాండ్‌లో ఇష్టానుసారం మార్పులు చేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు భూములు కొట్టేస్తున్నారని వాపోయారు. భూ విస్తీర్ణాల్లో మార్పులు, మ్యూటెషన్లలోనూ వైకాపా నాయుకులు చెప్పిందే చట్టం అన్నతీరుగా తీవ్ర అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా సామాన్య ప్రజలే అన్యాయమై పోతున్నారన్నారు ప్రత్తిపాటి. ఈ నేపథ్యంలోనే జూన్-4న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు రెవెన్యూ రికార్డులను మార్పులు, చేర్పులు చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరంపై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారాయన. అప్పటి వరకు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తమ భూములు సుర క్షితంగా ఉన్నాయా? లేదా? విస్తీర్ణాల్లో ఏమైనా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయా అనేది చూసుకుంటూ ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వైకాపా కబ్జాకోరుల చేతుల్లో ఆయుధంగా మారిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో పాటు వైకాపా నేతల భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ప్రత్తిపాటి పుల్లారావు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.