నారద వర్తమాన సమాచారం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై శాంతి కుమారి సమీక్ష
తెలంగాణ
:మే 25
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విస్తృ త ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సాయంత్రం అధికారులను ఆదేశించారు.
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్టుగా ఆమె చెప్పారు. రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం సాయంత్రం ఉన్నతాధికా రులతో సమీక్షించారు.
పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టా ల్సిన ఏర్పాట్ల పై అధికా రులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలుగ కుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు.
సభా ప్రాంగణం పరిసర పారంతాలలో పారిశుద్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పా టు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరిం చాలని జీహెచ్ ఎంసీ అధికారులకు సూచించారు.
పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను కోరారు. నిరంత రాయంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని విధ్యు త్ శాఖకు సూచించారు.
అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేసి కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వహిం చాలని సూచించారు.ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ముఖ్య కార్యదర్శులు బి వెంకటేశం, జితేందర్, కార్యదర్శులు క్రిస్టినా జోంగ్తు,అధికారులతో పాటు..
హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, టీఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.