నారద వర్తమాన సమాచారం
మే :25
తిరుపతి జిల్లా
తిరుపతి జిల్లాలో రౌడీషీటర్స్ పై ఉక్కు పాదం మోపుతున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, నాకాబంది నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దృష్ట్యా ఎన్నికలకు సంబంధించిన రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, అనుమానితులను నిలువరిస్తూ ప్రశాంత వాతావరణంలో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయడమే ధ్యేయం.
ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., ఆదేశాల మేరకు శనివారం నాడు తెల్లవారుజాము నుండి ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన పాత నేరస్తులు, రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లు, అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి, ఎలాంటి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, నాకాబంది నిర్వహిస్తున్నారు.
స్థానికులతో గ్రామసభలు/ వార్డు సభలు నిర్వహించి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నదని, పాటించాలని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ రోజు ఎలాంటి గొడవలకు, ర్యాలీలు పాల్గొనవద్దని చెప్పారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144 సి ఆర్ పి ఎస్ అమలులో ఉంటుందని, దానిని అతిక్రమించి అనవసరంగా క్రిమినల్ కేసులలో పాల్గొంటే వచ్చే నష్టాలను గురించి పోలీసు అధికారులు వివరించారు. పోలింగ్ రోజున ప్రజలు ఇప్పటికే తమ నిర్ణయాన్ని ఇచ్చారని, కేవలం ఫలితాలు మాత్రమే జూన్ 4వ తేదీన వెలువడుతాయనే విషయాన్ని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు గుర్తించుకుని ప్రశాంతంగా జీవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమాజం లో జరిగే నేరాలపై, చట్టాలపై అవగాహన కల్పించారు
- వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ఆధ్వర్యంలో పట్నాల వీధి, బొమ్మగుంట ప్రాంతాలలో రెండు ద్విచక్ర వాహనాల సీజ్.
- నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఆధ్వర్యంలో ఈసన్గాడు గ్రామంలో తనిఖీలు.
- డక్కిలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటగిరి సీఐ ఆధ్వర్యంలో మోపూరు రోడ్డు గ్రామంలో 12 ద్విచక్ర వాహనాలు సీజ్.
- గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ ఆధ్వర్యంలో పద్మ నగర్, కుర్ర కాలువ గ్రామాలలో తనిఖీలు.
- ఎర్ర వారి పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో భాకరాపేట సిఐ ఆధ్వర్యంలో బోడేవారి పల్లి, పి. వడ్డేపల్లి గ్రామాలలో తనిఖీలు.
ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, నాకాబంది కార్యక్రమాలలో ఆయా సబ్ డివిజన్ల సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.