జిల్లాలో ఇప్పటివరకు 307 కేంద్రాలలో దాన్యం పూర్తిగా కొనుగోలు చేశాం: జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే 26,
జిల్లాలో ఇప్పటివరకు 307
కేంద్రాలలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేశామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. ఆదివారం భిక్కనూరు, దోమకొండ మండలాలలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను సందర్శించి పలు సూచనలు చేశారు. ముందుగా బిక్నూర్ మండలంలోని అంతంపల్లి రామేశ్వర పల్లి, బిక్కనూర్ లో కొనుగోలు కేంద్రాలను, జంగంపల్లిలో శాకంబరి రైస్ మిల్లును, దోమకొండలో కొనుగోలు కేంద్రాన్ని, ముత్యంపేటలో నందిని రైస్ మిల్లును పౌర సరఫరాల ఇన్చార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 307 కేంద్రాలలో కొనుగోలు పూర్తయ్యాయని, ఇంకా 43 కేంద్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయనీ అన్నారు.అందులో కూడా నేడు, రేపు చాలా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆదివారం నాడు 116 లారీలు సమకూర్చి 2,795మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు అధికంగా అన్ లోడింగ్ పాయింట్లను పెట్టుకొని రోజు 15 నుండి 18 లారీలు దించుకుంటున్నారు. తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను తరలించి కేంద్రాలను క్లోజ్ చేయవలసిందిగా నిర్వాహకులకు సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 51,493 మంది రైతుల నుండి రూ.664 కోట్ల విలువ గల 3,01,545 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 90 శాతం మేర అనగా రూ. 572 కోట్లు రైతులు ఖాతాలో జమ చేశామని, 95 శాతం ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తయిందని, మిగతా రైతులకు ఒకటి, రెండు రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చంద్రమోహన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.