గీతం యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములో భద్రపరిచిన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా
ప్రతినిధి:మే 27,
సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన కామారెడ్డి, ఎలారెడ్డి,జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబందించిన గదులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నాడు పరిశిలించారు. సిసి కెమెరా నిఘాలో, మూడంచెల భద్రత మధ్య సెగ్మెంట్ వారీగా ఈవీఎం లను స్ట్రాంగ్ రూమ్ లలో సీల్ వేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇట్టి స్ట్రాంగ్ రూంలను సీఆర్పీఎఫ్, పొలిసు సిబ్బంది 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లోని కామారెడ్డి,
యెల్లారెడ్డి,జుక్కల్, బాన్సువాడ, జహీరాబాద్,నారాయణఖేడ్,
అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించి జూన్ 4 న గీతం యూనివర్సిటీ లో ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు సంసిద్ధతకు చేస్తున్న ఏర్పాట్లు, తీసుకుంటున్న ముందస్తు చర్యలపై న్యూఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, పోలిసు కమీషనర్లు,ఎస్పీ లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంగారెడ్డి నుండి ఆ జిల్లా కలెక్టర్, వల్లూరు క్రాంతి తో కలిసి పాల్గొన్నారు. అనంతరం గీతం యూనివర్సిటీ లో కామారెడ్డి జిల్లాకు సంబందించిన అసెంబ్లీ సెగ్మెంట్ స్ట్రాంగ్ రూమ్ లను కలెక్టర్ పరిశీలించి విజిటింగ్ రిజిస్టర్ లో సంతకం చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతరం కొనసాగుతున్న భద్రతాచర్యలను అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.