నారద వర్తమాన సమాచారం
దళిత విద్యార్థిని కారుణ్య మృతిపై సిబిఐ విచారణ జరిపి మారుతి నర్సింగ్ కళాశాల అనుమతులు రద్దు చేయాలని మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు
27 మే 2024
పినపాక నియోజకవర్గం
భద్రాచలం మండలం ఎ ఎస్ ఆర్ కాలనీలో మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక సంస్థ మహిళా వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెటిజయ అధ్యక్షతన కార్యవర్గ సమావేశంజరిగింది . ఈ సమావేశంలో మానవ హక్కుల మరియు అవినీతి వ్యతిరేక సంస్థ మహిళా వింగ్ రాష్ట్రకార్యదర్శి మహమ్మద్ సమీం మున్నీసా బేగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా వింగ్ చైర్మన్ రాగం కుసుమ మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో నీ ప్రవేట్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతికి కారుకులైన వారిని సరైన సెక్యూరిటీ భద్రత లేకుండా కాలేజీ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా వెలగట్టి మృతురాలు తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపించి మారుతి నర్సింగ్ కళాశాల యజమాన్యం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అనుమానం కలుగుతుందని అన్నారు. అనుమానాస్పద మరణాలపై సిబిఐతో విచారణ జరపాలని కళాశాల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు .విద్య వ్యాపారంతో పేద విద్యార్థులను మానసికంగా వేధిస్తూ సొమ్ము చేసుకుంటున్న మారుతి నర్సింగ్ కాలేజీ యాజమాన్యంపై సిబిఐతో ఎంక్వైరీ చేసి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .కారుణ్య చనిపోయి నాలుగు రోజులు అవుతున్న మృతికి గల కారణాలపై ఎటువంటి దర్యాప్తు చేయకపోవడం బాధాకరమని అన్నారు .ప్రభుత్వ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని కారుణ్య చావుకి కారణాలను బయటకు రాకుండా కప్పిపుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు .ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కారుణ్య మృతికి గల కారణాలను సిబిఐతో పూర్తి ఎంక్వయిరీ చేసి మరి ఏ విద్యార్థి చనిపోకుండా చూడాలని అన్నారు .కారుణ్య మృతి పై సిబిఐతో విచారణ జరిపి కారుణ్య మృతికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోకపోతే మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక సంస్థ ద్వారా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా చైర్మన్ యాకూబ్ పాషా, పి .దాసిం మహేశ్వరరావు, వలదాస్ సాలయ్య, కే నాగేశ్వరరావు ,శివరాణి, మాధురి , హనుమంతరావు,తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.