ఈనెల 31 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టరు హనుమంత్ కే. జండగే
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి,
ప్రతినిధి:
మే :29
బుధవారం నాడు జిల్లా కలెక్టరు హనుమంత్ కే జండగే పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. కొనుగోలు పూర్తి కావస్తున్నందున ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని మూసివేయాలని, జిల్లా వ్యాప్తంగా ఈనెల 31 లోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రామలింగాలపల్లి గ్రామంలోని కన్యకాపరమేశ్వరి రైస్ మిల్లులో ధాన్యం అన్ లోడింగ్ పనులను పరిశీలించారు. త్వరగా ధాన్యం అన్లోడ్ చేసుకొని తిరిగి లారీలను పంపాలని, ట్రక్ షీట్లను వెంటనే నమోదు చేయాలని, రైతుల ఖాతాలలో డబ్బులు త్వరగా అయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు గోపికృష్ణ, జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాసరెడ్డి, తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.