73 వ సారి రక్తదానం చేసిన డాక్టర్ బాలు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలికి ఓ పాజిటివ్ రక్తం అందజేత…
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే 31
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసరంగా రాజవ్వ (68) కి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో 73వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరాయంగా కృషి చేయడం జరుగుతుందని,
వేలాది మందికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని,సంవత్సర కాలంలోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 2500 యూనిట్లకు పైగా రక్తాన్ని అందజేసి రక్తదానంలో దేశంలోనే మొదటి స్థానంలో కామారెడ్డి జిల్లాను నిలపడం జరిగిందన్నారు.ప్రపంచంలోనే డబ్బు లేకుండా చేయగలిగే అత్యంత విలువైన సహాయం రక్తదానం మాత్రమేనని రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు.
రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు,మీడియా ప్రతినిధులకు, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు,జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్,ఉపాధ్యక్షులు డాక్టర్ పుట్ల అనీల్ కుమార్,
టెక్నీషియన్ అరుణ్ లు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.