జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్
కమిషన్ ఆదేశాల అనుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే 30,
జూన్ 9 న నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆదేశాలననుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఎఎస్పీ కాజల్ సింగ్ లతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ జిల్లాలో 4,797 మంది అభ్యర్థులు 12 కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు నియమించిన చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు కల్పించాలని, ప్రవాహారి గోడ లేని కేంద్రాలలో తగు బందోబస్తు ఉండేలా చూడాలన్నారు. కేంద్రం పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ చికిత్సకు ఏఎంఎం లను ఏర్పాటు చేయాలని, సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలన్నారు. ని, బయోమెట్రిక్ పద్ధతిన నిర్వహిస్తున్న ఇట్టి పరీక్ష ఉదయం 10. 30 నుండి మధ్యాన్నం 1 గంట వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్దతిలో జరుగుతుందన్నారు. ఐడెంటిఫికేషన్ అధికారులు ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను చెక్ చేస్తూ పరీక్ష కేంద్రాలకు 10 గంటల వరకు అనుమతించాలని, ఆ తరువాత ఎవరిని అనుమతించవద్దని, అవసరమైన బయోమెట్రిక్ డేవిస్ లను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరి నుండి బయోమెట్రిక్ తీసుకున్న తరువాత ఎవరిని బయటకు పంపారాదన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం సమయాన్ని తెలియజేసేలా ప్రతి అరగంటకు బెల్ మోగించాలన్నారు. పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులను బయటకు పంపరాదని స్పష్టం చేశారు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, షూస్ , ఎలక్ట్రానిక్ గాడ్జెస్ అనుమతి లేదని స్పష్టం చేశారు. రీజినల్ కో ఆర్డినేటర్లు, చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, తదితరులు అందరు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం జూన్ 7 న శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ రంగనాథ రావు, డీఈఓ రాజు, లింగం, ఆర్.టి.ఏ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర, విద్యుత్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ జ్యోతి పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.