డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి: సిపిఎం
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పోచంపల్లి మండల పరిధిలోని భీమనపల్లి గ్రామంలో మురికి నీరు మొత్తం రోడ్డు మీదికి రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కోట రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భీమనపల్లి నుండి కనుముకుల గ్రామానికి వెళ్లే దారిలో గ్రామానికి సంబంధించిన మురికు నీరును రోడ్డుమీదికి వదలడంతో రోడ్డు మొత్తం ప్రమాదంగా మారి దుర్వాసన వస్తుందని అన్నారు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి రోడ్డుమీద నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురికి నీరు రోడ్డు మీది రావడం వల్ల రోడ్డు మీదకు ఇరువైపులా మురికి నీరు రావడంతో పాకురు వచ్చి ప్రయాణికులు ప్రమాదానికి గురికావడానికి అవకాశాలు ఉన్నాయని, రోడ్డు మొత్తం దెబ్బతినే అవకాశం ఉందని అక్కడి నుండి వెళ్లాలంటే విపరీతమైన దుర్వాసన వస్తుందని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మురికి నీరును రోడ్డు మీదకు రాకుండా ఏర్పాట్లు చేసి సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. వీరి తో పాటు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాదం విష్ణు, మంచాల మధు, మండల కమిటీ సభ్యులు కలుకూరి బిక్షపతి, నెలకంటి జంగయ్య, నాయకులు బూరుగు బిక్షపతి, పురుషోత్తం రెడ్డి, జంగారెడ్డి, మల్లేష్, పాండురంగారెడ్డి, జనార్దన్ రెడ్డి, జంగారెడ్డి, నరసింహ, కుంభం జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.