కిష్టయ్య కుటుంబానికి అండగా మాజీ సీఎం కేసిఆర్..
కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్య కోసం కెసిఆర్ ఆర్థిక సాయం…
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి :జూన్ 02,
తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు.కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు.కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థికసాయం.ఎంబీబీఎస్ చదివించిన కేసీఆర్ పీజీ కోర్సుకు కూడా ఆర్థిక మద్దతు.నాడు ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతున్నది.అందుకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావలసిన 24 లక్షల రూపాయల చెక్కును నేడు నంది నగర్ లో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు.అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండని కిష్టయ్య పిల్లలకు బాధ్యత గుర్తు చేసిన కేసీఆర్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.