![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/06/img-20240604-wa25315667829612810741844-1024x771.jpg?resize=696%2C524&ssl=1)
టిడిపి విజయం పట్ల పార్టీ శ్రేణుల సంబరాలు
స్వీట్లు పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులు
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి,
ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో మండల, పట్టణ టిడిపి పార్టీ ఆధ్వర్యంలో సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మీసాల నరసింహ పట్టణ అధ్యక్షుడు బైరు లక్ష్మయ్య హాజరై సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. వారు మాట్లాడుతూ టిడిపి చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిందని దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు నాయకత్వంతోనే జరిగిందని వారు అన్నారు. జాతీయస్థాయిలో చంద్రబాబు నాయుడు కీలక నేతగా మారుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి ఆకుల సత్యం, పట్టణ శాఖ ఉపాధ్యక్షులు కుక్కలీ మహేష్, సీనియర్ నాయకులు వలందాస్ బక్కయ్య, చిలివేరుగోవర్ధన్ తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.