ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలుపొందిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు…
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:జూన్ 04,
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఎంపీ ఎన్నికల్లో సురేష్ కుమార్ షెట్కర్ గెలుపు సందర్భంగా పార్టీ కార్యాలయంలో స్వీట్లు ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.
అనంతరం ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సురేష్ షెట్కర్ గెలుపు కోసం కృషి చేసిన జిల్లా లోని ప్రతి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గాన్ని సైతం ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సూచనలతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సురేష్ షెట్కర్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేల శ్రీనివాసరావు , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఐరెని సందీప్, కామారెడ్డి పట్టణ యువజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ , జహీరాబాద్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మమ్మద్ సర్వర్ ,మాజీ కౌన్సిలర్ కైలాస్ లక్ష్మణ్ , దేవుని సూర్య, వలిపిశెట్టి భాస్కర్,జమీల్, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.