Friday, January 3, 2025

గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 39 మంది మృత్యువాత!

నారద వర్తమాన సమాచారం

జూన్ :06

గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 39 మంది మృత్యువాత!

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న భీకర దాడుల్లో గురువారం మరో విషాదకర ఘటన నమోదయింది. గాజాలో పాఠశాల నిర్వహిస్తున్న ఓ షెల్టర్‌పై ఇజ్రాయెల్ బలగాలు బాంబు దాడులు జరిపాయి. ఈ ఘటనలో కనీసం 39 మంది మృత్యువాతపడినట్టుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలో ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఐదుగురు స్కూల్ విద్యార్థులు సహా కనీసం 39 మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చునని స్థానిక హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలపై ఈ దాడి జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ దాడికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి.. కేపి


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading