నారద వర్తమాన సమాచారం
జూన్ : 06
ఐదేళ్లుగా వైకాపా చేసిన కర్మలే వారికి ఎదురొస్తుంటాయి: ప్రత్తిపాటి
మనిషి చేసే ప్రతిపనికి ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ కర్మ సిద్ధాంతం వైకాపా, ఎవరికైనా తప్పక వర్తిస్తుందన్నారు మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఐదేళ్లుగా వాళ్లేం చేశారో రాష్ట్రం మొత్తం చూసిందని, దానికి ప్రతిఫలంగానే ఎన్నికల్లో ఓటమి మొదటి ప్రతిఫలం మాత్రమే అన్నారాయన. మంచికి మంచి, చెడుకు చెడే ఎదురు వస్తాయని వైకాపా నేతలంతా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘనవిజయంతో గురువారం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటోలు దిగారు. ఉదయం నుంచి మొదలైన ఆ సందడితో రోజంతా ప్రత్తిపాటి నివాసం అభిమానులతో కిక్కిరిసిపోయింది. పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ, ఎస్సైలు, ఉద్యోగులు సహా పలువురు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతంరం మాట్లాడుతూ తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు ప్రత్తిపాటి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. రానున్న ఐదేళ్లలో అమరావతి, పోలవరం పూర్తితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అభివృద్ధితో పాటు రాష్ట్రమంతా జలసవ్వడులతో సుఖశాంతులతో విలసిల్లే రోజులు త్వరలోనే చూడబోతున్నామన్నారు. చంద్రబాబు నాయకత్వం, దార్శనికతలే ఆ దిశగా నవ్యాంధ్రను నవశకంలోకి నడిపించబోతున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.