గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువ మార్గంలో పాల్గొన్న వసంత వెంకటకృష్ణ ప్రసాదు.
నారద వర్తమాన సమాచారం జి కొండూరు ప్రతినిధి.
జగతికి శాంతి సందేశమిస్తూ క్రీస్తు శిలువనెక్కిన రోజు గుడ్ ఫ్రైడే..శాంతియుత సమాజం కోసం,సన్మార్గ జీవితాన్ని మానవజాతికి తెలియజేయడం కోసం తన రక్తాన్ని చిందించిన ఏసయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రేమతో జీవిద్దామని బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో ఆర్.సి.యం చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన శిలువ మార్గంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. శిలువను తన భుజాలపై ఎత్తుకుని మోశారు.
ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. అని పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.