నారద వర్తమాన సమాచారం
జూన్ :09
అక్షర యోధుడు రామోజీ కి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు అశ్రునివాళి.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని, పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు మరణం తీరని లోటని పలువురు జర్నలిస్టు మిత్రులు పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎస్ ఎన్ మీరా అధ్యక్షతన గుంటూరు బ్రాడీపేట లోని ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో జర్నలిస్టు మిత్రులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు మిత్రులు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి, పత్రిక, మీడియా వివిధ రంగాల్లో తనదైన శైలిలో రాణించి అసమాన్య విజయాలు సాధించి ఎందరో జర్నలిస్టులకు మార్గదర్శకులు అయ్యారని, రామోజీరావు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని జర్నలిస్టులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, ఐజేయు సభ్యులు ఓ మార్కండేయులు, సీనియర్ జర్నలిస్టు ఏపీయూడబ్ల్యూజే నాయకులు నిమ్మరాజు చలపతిరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు సునీల్ సందీప్, ఉపాధ్యక్షులు జొన్న రాజేష్ ,కోశాధికారి ఫణీంద్ర కుమార్, డాక్టర్ సేవకుమార్, పటాన్ ఆసిఫ్ ఖాన్, షేక్ రాజా సాహెబ్ పి శ్రీనివాసరావు, షేక్ మొగలయ్య , ఎస్ ఎండి షరీఫ్,పరస్యం నాయక్ , కోడి రెక్క కోటి రత్నం, ఎం సుబ్బారావు, బి సాంబశివరావు, ఎస్ జీవన్, లూర్ధు రాజు, చెరుకూరి సుబ్బారావు, రామకృష్ణారెడ్డి, రాంప్రసాద్ వాసు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.