నారద వర్తమాన సమాచారం
జూన్ :14
కాలుష్యాన్ని తగ్గించండి మొక్కలను పెంచండి
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలకుండా చూసుకోండి
బెంజ్ సర్కిల్ బ్యూటిఫికేషన్ కొరకు అధికారులకు నగర కమిషనర్ ఆదేశాలు
నిత్యం రద్దీగా ఉండే యం జి రోడ్, బెంజ్ సర్కిల్ జంక్షన్ నుండి రాంవరప్పాడు వెళ్ళు ఏలూరు రోడ్ మరియు సర్వీస్ రోడ్ను, విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉదయం నేషనల్ హైవే మరియు విజయవాడ అధికారులతో పరిశీలించి బెంజ్ సర్కిల్ బ్యూటీఫికేషన్ పై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రధానమైన జంక్షన్లో బెంజ్ సర్కిల్ జంక్షన్ ఒకటైనందున, కాలుష్యానికి తగ్గించే దిశగా గ్రీనరీ ని పెంచమని, వర్షం వల్ల రోడ్లు నిండి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో సైడ్ డ్రైన్లలో సిల్ట్ తీయడమే కాకుండా, డ్రైన్ లో నీరు ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ పర్యటనలు విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తోపాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్ ) కె.సత్యవతి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ ) జి.సృజన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ యస్ ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.