నారద వర్తమాన సమాచారం
జూన్ :15
క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించండి
సత్తెనపల్లి:
సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఈనెల 13వ తేదీన డిఎం అండ్ హెచ్ ఓ రవి క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కార్యక్రమం ప్రారంభించారు.అప్పటినుండి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం డాక్టర్ నజీర్(ఎపిడ్మాలజిస్ట్)ఆధ్వర్యంలో విజయవంతంగా 15వ తారీకు వరకు మొదటి బ్యాచ్ కు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రమాదకరమైన వ్యాధి అని మొదటి దశలోనే గుర్తించి దానికి నివారణ చర్యలు చేపట్టే విధంగా కృషి చేస్తామని అన్నారు.క్యాన్సర్ రహిత సమాజంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం అని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు వస్తే సంబంధిత మెడికల్ ఆఫీసర్ చొరవ తీసుకుని వ్యాధి నయం అయ్యేవరకు వైద్య సేవలు అందిస్తారని తెలియజేశారు.అందుకోసం పల్నాడు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్,ఏఎన్ఎం,సి హెచ్ ఓలకు బ్యాచుల వారీగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తున్నామని ఇప్పటికీ మొదటి బ్యాచ్ ప్రారంభించి వారికి నోటి క్యాన్సర్ సరికల్ క్యాన్సర్,రొమ్ము క్యాన్సర్, రక్తపోటు,మధుమేహం తదితర అంశాల గురించి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.మొత్తం ఆరు బ్యాచులుగా నిర్వహించే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో 300 మంది వరకు పాల్గొననున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ బి వి లక్ష్మణరావు, ఆర్ ఎం ఓ డాక్టర్ శోభారాణి, గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత, డాక్టర్ జాఫారి ఇమాంబి,నర్సింగ్ సూపర్డెంట్ రాధ,డాక్టర్ నజీర్ (ఎప్డిమాలజిస్టు),డాక్టర్ కుప్పాల అనూష,డాక్టర్ ధర్మసింగ్ శాస్త్రి, మెడికల్ ఆఫీసర్లు,సిహెచ్ వోలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.