జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నూతన నేర చట్టాలపై అవగాహన..
న్యాయ సలహాలు అందించిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి.లక్ష్మీనరసయ్య
నేరస్తులకు శిక్ష పడేటట్లు కృషి చేయాలి డిప్యూటీ డైరెక్టర్ పి.లక్ష్మి నరసయ్య..
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి:జూన్ 15,
- కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె. నరసింహ రెడ్డి ఆద్వర్యంలో నూతన నేర చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగినది.
• 2024 జూలై నుండి నూతన భారతీయ చట్టాల అమలు గురించి న్యాయ సలహాలు అందించిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నరసయ్య,తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి.వైజయంతి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి లక్ష్మీ నరసయ్య నిజామాబాద్ /కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మరియు కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగినది. ఇట్టి సమావేశంలో కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సన్నిహిత, (2) భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహిత (3) భారతీయ సాక్ష్య అధినయం-2023. ఐపిసి, సిఆర్పిసి, ఐఈఏ ( ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ) లో కీలక మార్పులు. ఇక పై ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కు అధిక ప్రాముఖ్యత, ప్రతి ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు పోలీసు అధికారులు కొత్త చట్టాల గురించి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి లక్ష్మీ నరసయ్య క్లుప్తంగా వివరించారు.
ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన విధులను శ్రద్ధతో నిర్వహించి నూతన చట్టాలను అవలంబించి నేరస్తులకు శిక్ష పడేటట్లు కృషి చేయాలని డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీనరసయ్య కోరినారు.
ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు కొత్త చట్టాలను అవలంబించి నేరస్తులకు శిక్ష పడేటట్లు క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ పీపీలు అయిన బోసారపు రాజేష్ గౌడ్, అశోక్ శివరాం, నంద రమేష్, నిమ్మ దామోదర్ రెడ్డి, రాజేశ్వరి, సత్యనారాయణ, శేషు, మరియు మారికొందరు పీపీలు, డిఎస్పీలు నాగేశ్వరరావు,
మాధనలాల్,ఇన్స్పెక్టర్ లు ఎస్సైలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.