నారద వర్తమాన సమాచారం
జూన్ :17
రుషికొండ రాజకోటపై జగన్ ఏం సమాధానం చెబుతారు?: ప్రత్తిపాటి
కనపర్రులో తెదేపా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న ప్రత్తిపాటి
ఇంతకాలం దాచిపెట్టిన రుషికొండ రాజకోట రహస్యాలపై జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. అయిదేళ్లపాటు జగన్‌రెడ్డి జనం సొమ్ముతో ఏ స్థాయిలో జల్సా చేశారో, పేదల పక్షపాతిని అంటూ వందల కోట్లు విలాసాలకు ఎలా తగలేశారో ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన రుషికొండ కట్ట డాలే చెబుతున్నాయన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఏకంగా రూ.45 కోట్లతో సోకులు చేసుకున్నది చాలక రుషికొండలో రూ.450 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మాణాలు ఎందుకు చేపట్టారో చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు ప్రత్తిపాటి. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు చిలకలూరిపేటలో తెలుగుదేశం కూటమి విజయాన్ని పురస్కరించుకుని ఆదివారం నాదెండ్ల మండలం కనపర్రులో విజయోత్సవ సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగానే పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ప్రత్తిపాటి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామస్థులను ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. వైకాపా ప్రభు త్వం అయిదేళ్ల పాలనలో దాచుకోవడం, దోచుకోవడం, నచ్చినవాళ్లకు కాంట్రాక్టుల రూపంలో వందలు, వేల కోట్లు సంతర్పణ తప్ప మరో పనే చేయలేదనడానికి తాడేపల్లి ప్యాలెస్, రుషికొండ నిర్మాణాలు ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశా ల్లో అయినా వీటిపై జగన్ నోరు విప్పకతప్పదన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరిమీద కక్ష సాధించా ల్సిన పనిలేదని, చేసిన తప్పులే వాళ్లను సంకెళ్ళయి వెంటాడతాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని, సస్యశ్యామల విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. చిలకలూరిపేటతో పాటు కనపర్రును అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.