నారద వర్తమాన సమాచారం
అమరావతి
జూన్ :17
మంగళగిరి ఈధ్గాలో బక్రీద్ సందర్బంగా మంగళగిరి శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
మంత్రి లోకేష్ కామెంట్స్
గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి 100 రోజుల్లో గంజాయి రాష్ట్రంలో అరికట్టాలి పోలీసులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ…
గంజాయి పై తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోం మంత్రిని పార్టీ అధ్యక్షుడిని పోలీసు ఉన్నత అధికారులను కలిసి వివరించా…
తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేసేందుకు ప్రణాళిక రుపోందించుకుంటానని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ నేతలే టీడీపీ నేతలను దాడులు, హత్యలు చేస్తున్నారు
మంగళగిరి నియోజకవర్గంలో చిలూవూరులో మైనారిటీ సోదరుడిని క్రికెట్ బ్యిట్ తో కొట్టి చంపింది నిజం కాదా
ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతియుతంగా ఓర్పుగా ఉండమన్నారనే విషయం గుర్తుంచుకోని దాడులకు దిగలేదని తిరిగి తమపై ఎలా ఆరోపణలు చేస్తారంటు ప్రశ్నించారు.
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనే శాంతియుతంగా ఉన్నాము
గెలిచి కేవలం 10 రోజులు మాత్రమే అని 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పగలరా
వైజాగ్ రిషికొండ వ్యవహారంపై ముఖ్యమంత్రి అధికారులకు నివేదిక సమర్పించమని కోరారు…
ఋషికొండ లాంటివి రాష్ట్రంలో చాలానే జరిగాయి అన్నిటి మీద నివేదిక వచ్చిన అనంతరం ప్రజల ముందు బహిర్గతం చేస్తాం…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.