అగాపే వర్షిప్ సెంటర్ లో గుడ్ ఫ్రైడే వేడుకలు
- చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు
- ఏసుప్రభు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించి న క్రైస్తవులు
నారద వర్తమాన సమాచారం
నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్,
ప్రేమ, క్షమాపణలకు ప్రతికగా నిలిచే జగద్రక్షకుడైన యేసుక్రీస్తు మరణ దినాన్ని స్మరిస్తూ అగాపే వర్షిప్ సెంటర్ లో గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు , అగాపే వర్షిప్ సెంటర్ వ్యవస్థాపకుడు బ్రదర్ రమేష్ జాన్ మాట్లాడుతూ…ఏసు ప్రభువు మానవజాతి మేలు కోసం ఇదే రోజున తన ప్రాణాలను త్యాగం చేశారని , మానవజాతి అన్ని పాపాలకు క్షమాపణను సూచిస్తుందని, లోక రక్షకుడిగా పేరొందిన ఏసు ప్రభువు తన ప్రజల ఆత్మల రక్షణ కోసం ప్రాణాలను సైతం విడిచారని పేర్కొన్నారు. అందుకే ఆ రోజును గుడ్ ఫ్రైడే , గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారని వివరించారు . ఈ సందర్భంగా యేసు ప్రభు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించారు. ప్రత్యేక గీతాలాపన చేసి క్రీస్తును ఆరాధించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల క్రైస్తవులు , నాయకులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.