నారద వర్తమాన సమాచారం
జూన్ :18
స్వరూపా నంద స్వామి భద్రతకు నెలకురూ.20 లక్షల ప్రభుత్వ ధనమా?… సెక్యూరిటీ తొలగించడానికి ప్రభుత్వం ఆదేశాలు
రాష్ట్రంలో పేరున్న, ఆదరణ ఉన్న స్వాములకు లేని భద్రత
ఈయనకు ఎందుకు?
వెంటనే పోలీసు పికెట్
తొలగింపునకు ఆదేశాలు
ఆధ్యాత్మిక స్వామిగా
గాక రాజకీయ స్వామిగా, పైరవీల స్వామిగా పేరుగాంచిన చినముషిడివాడ శారదాపీఠం
స్వరూపానందకు వైసీపీ ప్రభుత్వం కల్పించిన
కేటగిరీ స్థాయి భద్రత తొలగిపోనుంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్థాన గురువుగా
పేరుపడిన స్వరూపానంద వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ రేంజ్లో రెచ్చిపోయారు.
ఆయన అక్రమాలు అన్యాయాలపై విచారణకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం అందులో భాగం
గా ముందుగా భద్రతను తొలగించనుంది.
నలుగురు గన్ మెన్లు,
ఆరుగురు సిబ్బందితో పికెట్
రాజు తలచుకొంటే.. అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో ఎచ్చులకు పోయి నలుగురు గన్మెన్లు, ఆరుగురు సిబ్బందితో స్వరూపానంద పెందుర్తి పీఠం వద్ద పికెట్ పెట్టించుకొన్నారు.
24 గంటలూ వీరు ఇక్కడ కాపలాకా చేయాల్సిందే. ఒక ఎస్ ఐ ఈ పికెట్కు ఇన్చార్జిగా వుండి పర్యవేక్షిస్తారు.
దీనికిఅదనంగా ప్రోటోకాల్ కారు (బుగ్గకారు)వుంటుంది.
వీటన్నింటినీ నెలకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 18 నుంచి రూ.24 లక్షల ఖర్చు మాత్రమే….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.