.
నారద వర్తమాన సమాచారం
జూన్ :18
చిలకలూరిపేట
పల్నాడు జిల్లా ఎస్పీ మల్లీక గార్గ్ చిలకలురిపేట్ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ విజిట్ చేశారు.!
ఎలక్షన్ సంబంధించిన కేసులలో అరెస్టు కావలసిన ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయవలెను, అరెస్టు అయిన ముద్దాయిలకు గురించి ఎవరికైతే రౌడీషీట్స్ ఓపెన్ చేయాలో ప్రపోజల్స్ వెంటనే పంపాలి.
పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ గురించి మరియు సిబ్బంది యొక్క వెల్ఫేర్ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్స్ మరియు సిబ్బంది మండలంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ సిబ్బందితో కోఆర్డినేట్ అయ్యి గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ పోలీస్ యొక్క ఇమేజ్ పెంచాలని తెలియజేసారు.
చిలకలూరిపేట టౌన్ లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య “ట్రాఫిక్”, సదరు సమస్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాఫిక్ సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గంజాయి తాగేవాళ్ళని సహించమని ఆ కేసులన్నీ పరిశీలించి గంజాయి విక్రయించిన మరియు తాగిన వారిపై ఉక్కు పాదం మోపుతామని ఎస్పీ మీడియా వివరించారు.
చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ను పల్నాడు జిల్లా ఎస్పీ మల్లీక గార్గ్ విజిట్ చేసి, 2004లో మావోయిస్టుల చేతిలో వీరమరణం పొందిన సిఐ ఆర్ ప్రసాదు మరియు సిబ్బందికి శ్రధ్ధాంజలి ఘటించారు.
చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ క్వార్టర్స్ ను విజిట్ చేసి త్వరలో వాటి స్థానంలో కొత్త క్వార్టర్స్ కు ప్రపోజల్స్ పంపుతామని తెలియజేసినారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, పల్నాడు జిల్లా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.