నారద వర్తమాన సమాచారం
ముగిసినఅర్బన్ బ్యాంక్ ఎన్నికలు మెజార్టీ స్థానాలు దక్కించుకున్న తడక రమేష్ ప్యానల్
గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్న ఎన్నికల అధికారి శ్రీనివాస్
భూదాన్ పోచంపల్లి,
ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో శుక్రవారం జరిగిన పోచంపల్లి అర్బన్ బ్యాంక్ ఎన్నికల లెక్కింపుఫలితాలు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి.
కాగా ఈ సందర్భంగా తొమ్మిది డైరెక్టర్ స్థానాలకు 27 మంది అభ్యర్థులు పోటీ చేయగా 2301 ఓట్లు ఉండగా అందులో 1794 పోలయ్యాయి. రెండు ప్యానల్ గా ఏర్పడి పోటీలో పాల్గొన్నారు. చైర్మన్ అభ్యర్థులుగా తడక రమేష్ కర్నాటి వెంకట బాలసుబ్రమణ్యం పోటీలో ఉండగా ఇందులో తడక రమేష్ వర్గానికి చెందిన ఆరుగురు డైరెక్టర్లు గెలుపొందడంతో చైర్మన్ గా గెలుపొందారు. కాగా ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగాయి. నువ్వా నేనా అన్న రీతిలో నిమిషం నిమిషానికి ఫలితాలు మారాయి. ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఫలితాలలో ఒక్క డైరెక్టర్ స్థానం కోసం ఇద్దరు పోటీ పడగా కొండమడుగు ఎల్ల స్వామికి 1113 ఓట్లు పోలుకాగా పోవనపు శ్రీనివాస్ పై 530 ఓట్ల పోలయ్యాయి. 583 మెజార్టీతో గెలుపొందారు. ఇద్దరు మహిళ డైరెక్టర్ల కోసం ముగ్గురు పోటీలో ఉండగా అందులో గుండు కావ్య 1136 ఓట్లు సాధించగా, కర్నాటి భార్గవి 952 సాధించుకొని మహిళ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. కాగా కడవేరు కవితకు 827 ఓట్లు పోలయ్యాయి.
ఆరుగురు జనరల్ స్థానాల కోసం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో మొత్తం 1794 ఓట్లు పోలయ్యాయి. కాగా అందులో నూట నలభై ఒక్క ఓట్లు రద్దు అయ్యాయి. 1653 ఓట్లు గుర్తింపు వచ్చాయి. ఇందులో అత్యధిక మెజార్టీ తడక రమేష్ 1194 సాధించగా తరవాత కర్నాటి వెంకట బాలసుబ్రమణ్యం 810, ఏలే హరిశంకర్ 711, భారత రాజేంద్రప్రసాద్ 682, సురపల్లి రమేష్ 680, రాపోలు వేణు 670, డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నిక ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఎన్నికల అధికారి జి శ్రీనివాస్ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.