మంత్రి అంబటి రాంబాబు
మూడవ శనివారం తిరుణాల మహోత్సవములో స్వామివారికి భక్తుల జననీరాజనం
నారద వర్తమాన సమాచారం :రాజుపాలెం:ప్రతినిధి
రాజుపాలెం మండలం దేవరం పాడు గ్రామంలో స్వయంభువుగా వెలిసిన నేతి వెంకన్న స్వామి ఆలయ మూడవ శనివారం తిరుణాల వేడుకలు , స్వామివారి కల్యాణమహోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు , నిర్వాహకులు మంత్రి అంబటిని సాదరంగా ఆహ్వానించారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు . స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు.
మంత్రితో పాటు పాల్గొన్న నాయకులు తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. వెంకన్న స్వామి మత్స్య అవతారంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేక త.
మంత్రితోపాటు గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, ప్రజాప్రతినిధులు , వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు తదితరులున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.