వైఎస్సార్సీపీలో చేరిన కొత్తపల్లి టీడీపీ నాయకులు, కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
నారద వర్తమాన సమాచారం:అచ్చంపేట;ప్రతినిధ
అచ్చంపేట మండలంలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం.. ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.
అచ్చంపేట మండలం కొత్తపల్లి లో టీడీపీకి చెందిన11 కుటుంబాల వారు.. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్తుందన్నారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి నచ్చి ఎంతోమంది టీడీపీ నుంచి తమ పార్టీలో చేరుతున్నారన్నారు.
ప్రతిపక్షాలు కలలో కూడా ఊహించలేని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేశామన్నారు. మరోసారి తనను ఆదరిస్తే.. పెదకూరపాడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో కట్టికోట శ్రీనివాసరావు, లక్ష్మీపతి, సాంబశివరావు, గురజాల శ్రీనివాసరావు, రామాంజనేయులు, సైదయ్య, మందపాటి వెంకట నరసింహారావు, నడింపల్లి వెంకటేశ్వరరావు, కనుమూరి రేవతి, మోదుగుల సీతయ్య, షేక్ హుస్సేన్ తదితరులున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.