నారద వర్తమాన సమాచారం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దూప దీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనం.ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశానికి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు అయినటువంటి నరేంద్ర చారి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ధూప దీప నైవేద్య అర్చక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చినటువంటి అర్చకులకు స్వాగతం పలికారు మొదటగా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు జంగం మహేష్ మాట్లాడుతూ మన లోపల ఉండే ఐక్యత ఎప్పుడూ విడిపోకూడదు అని సెలవిచ్చారు తర్వాత నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఎం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ మనము అర్చకులం అందరమూ కలిసికట్టుగా ఉన్నట్లయితే ఏ విధమైన అపోహలు మనల్ని దరిచేరవు అనే విధంగా మాట్లాడారు ఆ తరువాత జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు నరేంద్ర చారి మాట్లాడుతూ అలంపూర్ ఈ చౌరస్తాలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మీరందరూ ఈ సమావేశానికి వచ్చినందుకు మేము మా జోగులాంబ గద్వాల జిల్లా ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము అని చెబుతూ ఈ విధంగా మనలో ఒకరైన పులికల్ గ్రామంలో జరిగినటువంటి దుశ్చర్యమైనటువంటి ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ ఒక చిన్న ధూపదీప నైవేద్య అర్చకునిపై కక్షభూని ఈ విధంగా చేయడము ఆ పెద్దమనిషికి సిగ్గుచేటుగా ఉండాలి అని మాట్లాడారు తర్వాత నాగర్ కర్నూలు జిల్లా దూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రాష్ట్రంలో మనకు చిన్న గౌరవ వేతనంతో మనము ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ గ్రామంలోని ప్రజల యొక్క ఆటుపోటులను ఎదుర్కొంటూ ఈ చిన్ననైనటువంటి గౌరవ వేతనంతో బతుకుతున్నాను అటువంటి మనల్ని గుడులను తీయాలి అనేది దుశ్చర్యమైనటువంటి విధానం మనకు వెన్నంటి ఉన్నటువంటి వాసన ఉన్నంతవరకు మనము మన సంఘాలు ఏకధాటిగా ఉండాలి అని చెప్పి ముగించారు అదేవిధంగా వనపర్తి జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు లక్ష్మి కాంతా చారి మాట్లాడుతూ కొన్ని శక్తులు మన వెంటపడుతున్నాయి ముందుగా విచారణ జరిపినట్లైతే ఈ సమస్య రాదు కదా అన్ని జిల్లాల వారిని కలిసి ఉండాలి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని తెలిపారు అదే విధంగా 647 మంది ధూప దీప నైవేద్య సంఘ అర్చకులు 33 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు మనకు అధికారుల ద్వారా సమయపాలన ఒత్తిడి వస్తున్నది ఉదయం ఏడు గంటల నుండి 11:30 వరకు దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు దేవాలయములోనే ఉండాలి అని ఒక నిబంధన అంటున్నారు అది మనకు సాధ్యం కాకపోవచ్చు మనలో కొంతమంది ఈ పథకాన్ని తీసివేయాలి అని దుర్చర్య పూర్వకంగా ప్రభుత్వపరంగా ఇబ్బంది చేస్తున్నారు దీనిని తొలగించాలంటే మనందరం కలిసికట్టుగా ఉండాలి రాష్ట్ర సంఘము సహాయ సహకారాలు కూడా మనకు అందజేయాలి సంఘాల ద్వారా మన పెద్దలు మనకు వారికి తెలిసిన విధానాలు తెలియపరచాలి ఆలయాలకు వెళ్ళని వారు ఉదయము దేవాలయము వద్ద పూజలు చేయనివారు మన అర్చకులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వృత్తి మానుకోండి మార్చుకోకపోతే అతనినీమన సంఘం నుండి విని వేయాలి ఈ విధంగా మనము మనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పరచుకున్నప్పుడే వేరొకడు మనల్ని వేలు చూపి వెక్కిరించే పని ఉండదు. కొన్ని రోజులు ఓపిక పడితే మనం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా అవ్వడానికి ముందుకు పోదాం అందరమూ కలిసిమెలిసి ఉండి ఇవి చేయాలి సంఘమంతా ఐకమత్యంతో ఉండాలి పక్కవాడి కష్టాన్ని మన కష్టంగా భావించినప్పుడే మనము పూజారులము అవుతాము మనము ఎవరిని ఉద్దేశపూర్వకంగా అతనికి ఇబ్బంది కలిగినట్లు మాట్లాడము. మనం ఎప్పుడైనా శతమానం భవతి అని మాత్రమే వచ్చినటువంటి భక్తులను ఆశీర్వదించే వాళ్ళం మరి అలాంటి తెలిసినటువంటి వారే అశుభం పలుకుతున్నారు అని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు పలికారు ప్రతి ధూప దీప నైవేద్య అర్చకులు హిందూ ధర్మాన్ని కాపాడాలి ఒకవేళ మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే ఎవరైతే చేసిండ్రో వారు మనము ప్రతినిత్యం పూజించే భగవంతుడు వారినే భూస్థాపితం చేస్తాడు అదేవిధంగా మనము చేతులు కట్టుకొని కూర్చుందామా అని అంటే కాదు అవసరాన్ని బట్టి సమయాన్నిబట్టి సందర్భాన్ని బట్టి చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టి చంపాలి అనేటటువంటి సామెతను నిరూపించాలి మన అందరము ఆత్మాభిమానంతో ఉండాలి కొండంత అండతో మన రాష్ట్ర దూప దీప సంఘ అధ్యక్షులు వాసుదేవ శర్మ ఉన్నారు వారికి మనం ఎల్లవేళలా అనుకూలంగా ఉండాలి ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి మాట్లాడుతూ జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో పత్రికా మిత్రులు గోరంతలు కొండంతలుగా రాయవద్దు మా ఆత్మీయులతో రాష్ట్ర భాగోవుల యొక్క అర్చకులు మేము అటువంటి మా మీద లేనిపోని మనసులో ఏదో ఒకపటం పెట్టుకుని ఒక పెద్ద మనిషి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎండోమెంట్ దేవాలయంలో ఎండోమెంట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ ఒక చిన్న గౌరవ వేతనం నెలకు పదివేలు తీసుకునే అందులో 6000 మాత్రమే మనవి మిగతా నాలుగు వేలు భగవంతుని వస్తువులకు వినియోగించేటివి అటువంటి చిన్న వ్యక్తిని ఈ చిన్న అర్చక వృత్తి కూడా చేయకుండా అతన్ని అతనికి వచ్చే గౌరవ వేతనాన్ని ఎండోమెంట్ అధికారుల చేత హోల్డ్ చేయించారు మరి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి విన్నవించడం మరియు హెచ్చరించడం జరిగింది రాష్ట్ర కోశాధికారి నందన హరికిషన్ మాట్లాడుతూ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారు మరి దేవాలయములో తిరుగుతుండే అర్చకుడే సాక్షాత్తు భగవంతునితో సమానమని మర్చిపోవద్దు తోటి అర్చకులు ప్రతి సమావేశానికి చేరుకొని ప్రతి విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి మాట్లాడాడు బొజ్జ నాయక్ మహారాజ్ మాట్లాడుతూ మనం తేనెటీగలుగా ఉండాలి ఒక్క తేనె తెట్టెను ఒక వ్యక్తి రాయితో కొడితే ఆ తేనెటీగలు మొత్తము ఆ వ్యక్తిపై దాడి చేస్తాయి మనం కూడా తేనెటీగల్లాగా కలిసికట్టుగా ఉండాలి నీ పార్టీలో ఉంటే జీతం ఇస్తాను నా పార్టీలో ఉంటే జీతం ఇస్తాను అనే విధానాన్ని రూపుమాపాలి అని చెప్పి అతను తెలిపారు, వ్యవస్థలో కొన్ని మార్పులు ఉండొచ్చు అది సహజం కానీ దానిని తప్పకుండా మనకు తెలియపరచాలి అది తెలియపరచకుండా నేనే పెద్ద అనేటటువంటి విధానం మార్చుకోకపోతే రాబోవు కాలంలో మేము చేసేటటువంటి హెచ్చరికకు మీరు బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి వివరించారు సమస్య ఉన్నట్లయితే అతనికి ఒకసారి తెలియపరచి ఈ విధంగా ఉండాలి అని చెప్పి పరిష్కరించుకోవాలి. ఈ పులికల్లు గ్రామంలో మరి తండ్రి కొడుకులు చెరొక దేవాలయంలో ధూప దీప నైవేద్య అర్చకునిగా ఉన్నారు మనిషి ఎదగాలని ఆశ ఎవరికైనా ఉంటుంది కానీ తప్పు చేస్తే మందలించాను కానీ ఇబ్బంది పెట్టరాదు చలిచమరమే కానీ ఏనుగునైన కట్టేయగల శక్తి మా అర్చకులకు ఉంది అని తెలుసుకో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాసుదేవ శర్మ అక్కడే ఉంటాడు అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు మరొక్కసారి మాట్లాడు మా పొట్ట కొట్టే వాడికి ఇబ్బంది చేయి అనడం గానీ మా మీదకి వచ్చేవారికి ఆ భగవంతుడే బుద్ధి చెప్తాడు మన సంకల్పం గట్టిదైతే అందరము సమైక్యంగా ఉండాలి మనం చేసే పూజ సంకల్పంతో మొదలు పెడతాం కాబట్టి మనము కూడా సంకల్పాన్ని ప్రారంభించడం అంటే అది అయిపోయినంత వరకు కూడా మన యొక్క ఈ శ్రమ ఆగకుండా పోరాడవలసినటువంటి అవసరం ఉన్నది ఒక్క ఆలయం చూపించి తెలంగాణ రాష్ట్రమంతా ధూప దీప నైవేద్య అర్చకులు దొంగగా పదవులు పొందారు అంటే ఎలా సర్వేజనా సుఖినోభవంతు అనే మనమే ఈ విధంగా అంటే బాగుంటుందా ఒక హిందువై పుట్టి హిందువులకు ద్రోహం చేసినట్లు చేశాడు నా లక్ష్యం డిడిఎన్ఎస్ అర్చకునికి మంచి చేయడమే ఇబ్బంది లేకుండా ఉండడమే నీవు చేసినటువంటి ఈ దుశ్చర్య పొట్ట కొట్టినటువంటి పైకము నీ పేరున జమైనలా అది లేదు కదా మరి ఈ పులికల్లు వాళ్ల మీద బురదజల్లే ప్రయత్నం చేస్తే మేము ఎంతటికైనా తెగిస్తాం అని హెచ్చరించారు ఒక ముద్ద జరిగిన తప్పుకు రాష్ట్రమంతటా దేవాదాయ శాఖ వారు తప్పు చేసిందంటే అది సరికాదుకదా అని తెలిపారు ఎంతటి పెద్దవారునైనా ప్రత్యక్షంగా నైనా పరక్షంగా అయినా మా మీద లేనిపోని అపనిందలు చేసినట్లయితే వారిని ఏ విధంగా ఎదుర్కోవాలో మాకు తెలుసు ఎన్ని ఇబ్బందులైనా రాష్ట్ర సంఘము జిల్లా సంఘాలకు మండల సంఘాలకు అండగా ఉంటుంది అని తెలిపారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొండ సురేఖ కి దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు వారికి విన్నపం ఏమంటే మా యొక్క విన్నపాలు
1) ధూప దీప నైవేద్య అర్చకుల కనీస వేతనం మరియు ఉద్యోగ భద్రత
2) అర్చకులకు హెల్త్ కార్డులు
3) అర్చక వెల్ఫేర్ పండు గ్రాంటు ప్రతి ధూప దీప నైవేద్య అర్చకులకి వర్తింపజేయడం
4) మరణించిన అర్చకునికి గ్రాట్యూటీ ఇవ్వడం
5) ప్రతి ఒక్క అర్చక కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ రూమ్ లేదా సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణమునకు ఆర్థిక సహాయం చేయుట
6) ప్రతి ఒక్క ధూప దీప నైవేద్య అర్చకులకు ప్రభుత్వ గుర్తింపు కార్డుల మంజూరు చేయుట
7) పెద్ద దేవాలయాల్లో మన తెలంగాణలో ఉన్న దేవాలయాల్లో ఉచిత దర్శనం కల్పించడం
8) ప్రతినెల ఐదవ తేదీ లోపు ప్రతి అర్చకునికి గౌరవ వేతనము లు అర్చకుల ఖాతాలో జమ అగునట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పైన పేర్కొనబడిన మా విన్నపములను దయతో పరిష్కరించి ధూపదీప నైవేద్య అర్చకుల కుటుంబాల అభివృద్ధికి తోడ్పలగలరని తమరిని సవినయంగా కోరుచున్నాము అని చెప్పి మా యొక్క ఈ ధూప దీప అర్చకుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న వారందరికీ పులికల్ గ్రామంలో జరిగినటువంటిది మన జిల్లాలో ఎక్కడ జరగకుండా మనందరం సమిష్టిగా ఉండి మనకు నిర్వర్తించే పూజా విధానాలను సజావుగా జరిపించాలని చెప్పి మనవి చేస్తున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు జంగ మహేష్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఎన్ జ్ఞానేశ్వర్, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు నరేంద్ర చారి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు జే చంద్రశేఖర్, వనపర్తి జిల్లా అధ్యక్షులు లక్ష్మీకాంతా చారి తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ, గౌరవ సలహాదారులు రామలింగేశ్వర శర్మ కార్య నిర్వాహక అధ్యక్షులు నాగదక్షిణామూర్తి ముఖ్య సలహాదారులు గంగు కృష్ణ చైతన్య జి లక్ష్మీరషయ్య శర్మ కోశాధికారి ఎస్ హరికిషన్ శర్మ కన్వీనర్ గోపి కృష్ణమాచార్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అన్నావచ్చిన ప్రశాశర్మ అన్నంబట్ల ఫణి కుమార్ శర్మ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మండల ఇన్చార్జీలు అర్చకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.