నారద వర్తమాన సమాచారం
అమరావతి..
జులై 1 న పెనుమాకలో స్వయంగా సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో జులై 1 వ తేదీన స్వయంగా లబ్ది దారుల ఇళ్ళకు వెళ్ళి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సామాజిక పెన్షన్లు అందించనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒక గ్రామంలో సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి కానుంది.
జూలై 1న సామాజిక పెన్షన్ లబ్ది దారుల ఇళ్ళవద్దే ₹7000 పెన్షన్ (నెలవారీ పెన్షన్ ₹4000 + ఏప్రిల్, మే,జూన్ నెలల బకాయి ₹3000) అందిస్తామనే ఎన్నికల హామీ మేరకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియడంతో పెనుమాక గ్రామంలో సందడి నెలకొంది. అధికారులు, పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.