నారద వర్తమాన సమాచారం
ప్రశ్నిస్తే ప్రాణం తీస్తాం,ఖబర్దార్!!
మంగళగిరిలో అక్రమ రేషన్ మాఫియా ఆగడాలు..అక్రమ రేషన్ రవాణా గురించి ప్రశ్నిస్తే తమ దగ్గర ఉన్న వాహనాలతో చంపుతాను అని బెదిరింపులు..
వారి వల్ల ప్రాణభయం ఉంది అని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్లిన ఉపయోగం లేదు..
కంప్లైంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా,అక్రమ రేషన్ రవాణా చేసే వ్యక్తితో రాజీ చేయటానికి ప్రయత్నం చేసిన అధికారులు..
మామూళ్ల మత్తులో ఊగుతూ రేషన్ మాఫియాకు వత్తాసు పలుకుతున్న కొంతమంది పోలీసులు మరియు సంబంధిత అధికారులు..
మంగళగిరిలో రోజు రోజుకి అక్రమ రేషన్ రవాణా చాప కింద నీరు లాగా పాకుతుంది..
పోలీస్ అధికారుల సాక్షిగా వార్నింగులు ఇస్తు,రేషన్ మాఫియాకి నేనే డాన్..అని చెప్పుకుంటున్న మంగళగిరిలో రేషన్ అక్రమ రవాణా చేసే రేషన్ మాఫియా వ్యక్తి.
ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే బియ్యాన్ని అక్రమ రవాణా చేసి కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు.
రేషన్ ఇచ్చే వాహనాల పైన కూడా అతని నియమించిన కుర్రోళ్ళు ఉండి.. డైరెక్ట్ గా వాహనాల వద్ద ప్రజల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్న కూడా అధికారులు ఏమి పట్టనట్లు ఉండడం గమనార్హం..
రేషన్ మాఫియా డాన్ అని చెప్పుకుంటూ నియోజవర్గంలో జనాలని భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తి.
అసలు ఎవరు ఈ రేషన్ మాఫియా డాన్!
రేషన్ మాఫియా డాన్ అని చెప్పుకుంటున్న వ్యక్తి చుట్టుపక్కల ఉన్న రైస్ మిల్లుల వాళ్ళని మరియు రేషన్ సప్లై చేసే వాళ్లని బెదిరించి వ్యాపారం చేస్తూ అడ్డు చెప్పిన వారిని చంపడానికైనా సిద్ధపడే స్థితికి వచ్చాడు అంటే,మంగళగిరి నియోజకవర్గ పరిధిలో పోలీసు శాఖ నుంచి అధికారుల నుంచి అతనికి ఎంత మద్దతు ఉంది అనేది తెలుస్తుంది..
కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈ అక్రమ రేషన్ నివారించాలి ప్రయత్నిస్తున్న సరే,పేదవారి నోటి దగ్గర కూడు లాగేస్తున్న ఇటువంటి అక్రమ రవాణా చేసే వారి మీద చర్యలు ఉండవా,!
రేషన్ మాఫియా డాన్ అని చెప్పుకునే ఇతను గతంలో పలుసార్లు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో రేషన్ అక్రమ రవాణా చేస్తున్న సమయంలో దొరికినా సరే డబ్బులు ఇచ్చి తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.
పోలీసులుగాని అధికారులు కానీ నన్ను ఎవరు ఏమి చేయలేరు అని ఒక నిర్ధారణకు వచ్చిన ఇతను,ఈరోజు అవసరమైతే మనుషుల ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డాడు అంటే తనకి అధికారుల నుంచి ఏ స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పాల్సిన అవసరం లేదు..
ఇటువంటి అరాచక శక్తులు మీద పోలీసు శాఖ నుంచి తగిన చర్యలు తీసుకొని సామాన్య ప్రజలను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా పోలీసు అధికారుల మీద ఉంది..
కొత్తగా వచ్చిన పోలీసు శాఖ అధికారులైన రేషన్ మాఫియా డాన్ అని చెప్పుకొని జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నా వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారా? లేదా వీరు కూడా గతంలో అధికారులు లాగా రేషన్ మాఫియాతో చేతులు కలుపుతారా అనేది వేచి చూడాలి.. ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన అక్రమ రేషన్ రవాణాను నిలువరించే వారు ఎవరూ లేరా అనేది ఈరోజు జవాబు లేని ప్రశ్న..?
Discover more from
Subscribe to get the latest posts sent to your email.