నారద వర్తమాన సమాచారం
ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్
ఝార్ఖండ్
:జులై 04
ఇటీవల బెయిల్ పై విడుద లైన హేమంత్ సొరెన్ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొరెన్ అధిష్ఠిం చారు.
రాంచీలోని రాజ్ భవన్ లో హేమంత్ సొరెన్ తో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. 8.5 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన సొరెన్ 5 నెలల పాటు జైల్లో గడిపారు.
ఆయనకు ఇటీవలే న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. కాగా, హేమంత్ సొరెన్ జైల్లో ఉన్న సమ యంలో చంపయీ సొరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
హేమంత్ సొరెన్ జైలు నుంచి విడుదలైన నేప థ్యంలో, అధికార జేఎంఎం ఎమ్మెల్యేలు చంపయీ సొరెన్ నివాసం లో సమావేశమయ్యారు.
హేమంత్ సొరెన్ ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంపయీ సొరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, హేమంత్ సొరెన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానిం చారు.
వాస్తవానికి జులై 7న ప్రమా ణ స్వీకారం చేయాలని హేమంత్ సొరెన్ భావిం చారు. అనూహ్య రీతిలో ఈ మధ్యాహ్నమే ప్రమాణ స్వీకారం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.