నారద వర్తమాన సమాచారం
నెట్వర్కు లేకుండా ధరలు పెంచడం దారుణం : డా.చదలవాడ హరి బాబు, సిసిఐ జాతీయ ఉపాధ్యక్షులు, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటి సభ్యులు – పిల్లి యజ్ఞ నారాయణ
ఇటీవల జియో, ఎయిర్ టెల్ నెట్వర్కు కంపెనీలు తమ సర్వీసు స్లాబులను దారుణంగా 20% పెంచారే తప్ప వినియోగదారులకు నాన్యమైన నెట్వర్క్ అందించడంలో వారు విఫలమయ్యారని గర్తపురి కన్స్యూమర్స్ కౌన్సిల్ వారు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సి.సి.ఐ. జాతీయ ఉపాధ్యక్షుడు డా. చదలవాడ హరిబాబు పాల్గొని ప్రసంగిస్థూ అన్నారు. ఇతర కంపెనీల నెట్-వర్కుల నుండి తమ కంపెనీలకు మార్చుకునేందుకు ఆకర్షణీయమైన పధకాలను పెట్టి వినియోగదారులను ఆకర్షించి వారి నెట్ వర్క్ లోకి మారినాక సిగ్నల్ సరిగా రావటము లేదని పలుమార్లు ఫిర్యాదులు లిఖిత పూర్వకముగా, మేసేజ్ ల ద్వారా కంపెనీలకి ఫిర్యదు చేసినా నిర్లక్ష్యముగా ఉన్నారని హరిబాబు ఆవేదన చెందారు. ఏక పక్షముగా స్లాబులు పెంచడము ట్రాయ్ నిబంధనలను ధిక్కరించడమే అన్నారు. సదరు విషయాలను అన్ని వినియోగదారుల సంఘాల వారు ట్రాయ్ కి కంప్లయింట్ చేయాలన్నారు. పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ మాట్లాడుతూ నెట్వర్క్ సిగ్నల్ సరిగా లేకుండా స్లాబు రేట్లు 20 శాతం పెంచేయటం సమంజసం కాదని, ఈ విషయంలో అన్ని వినియోగదారుల సంఘాలు మరియు ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందని, ట్రాయి సైతం ఈ విషయంలొ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశములో గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటి సభ్యులు బీరాల నాగేశ్వరరావు, మునిపల్లె కవిత, బేబీ సరోజని, యశ్వంత్ సిన్హా, వల్లెం చెన్నకేశవులు, మల్లిఖార్జునరావు, నాగమణి పాల్గొని ప్రసంగించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.