నారద వర్తమాన సమాచారం
జగన్నాథుని విగ్రహ నీడ అద్దంలో కనిపించకుండా పోవడానికి గల అసలు కారణమేంటో తెలుసా..?
హిందూ ధర్మంలో చార్ ధామ్ యాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ యాత్రను పూర్తి చేసిన వారు భగవంతుని సన్నిధిని చేరుకుంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఈ నాలుగు ధామ్‌లలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ ధామ్‌లో ఉన్న జగన్నాధుని విగ్రహం ఎల్లప్పుడూ చర్చనీయంగా మారి ఉంటుంది.ఈ పూరీ ధామ్‌లో ఉన్న జగన్నాధుని విగ్రహం కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
అంతే కాకుండా ఈ దేవాలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు, రహస్యాలు ఉన్నాయి.
జగన్నాథుని విగ్రహం కూడిన ఒక సంఘటన ప్రజలను ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.నిజానికి జగన్నాథ విగ్రహం నీడ ఒకసారిగా కనిపించకుండా పోయింది.
ఈ సంఘటనను చూసిన పండితులు భక్తులంతా ఆశ్చర్యపోయారు
1890వ సంవత్సరంలో జన్మాష్టమి రోజున పూర్ణ రాజు దేవునికి ప్రసాదం సమర్పిస్తున్నాడు.ఆ సమయంలో జగన్నాధుడి నీడ అద్దంలో కనిపించకపోవడంతో రాజు ఆశ్చర్యపోయాడు.జగన్నాథుడు భోజనం చేయడం లేదని ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు.
అప్పుడు నగర ప్రజలందరూ జగన్నాధునికి రోజంతా వివిధ రకాల ఆహారాలను సిద్ధం చేశారు.అయినప్పటికీ జగన్నాథుడి నీడ కనిపించలేదు.
ఈ సంఘటనను చూసిన రాజు జగన్నాథుడి విగ్రహం నీడ కనిపించకుండా పోవడానికి వెనుక ఉన్న కారణం తెలిసే వరకు తను భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశాడు.
అంతేకాకుండా రాజు ఆ దేవాలయంలో కూర్చొని దేవుడి నీడ కోసం ఎదురుచూస్తున్నాడు.అలా రాజు ఎదురుచూస్తూ చూస్తూ కునుకు తీశాడు.అప్పుడు ఆ రాజుకు కలలో జగన్నాథుడు కనిపించి తను దేవాలయంలో లేనని భోజనం చేయడానికి ఒక పేద భక్తుడి గుడిసెకు వెళ్లాలని, అందుకే దేవాలయంలోని తన విగ్రహం నీడ కనిపించలేదని చెప్పాడు.
ఈ ఘటన తర్వాత జగన్నాధునికి మళ్ళీ నైవేద్యాలు సమర్పించినప్పుడు అద్దంలో జగన్నాథుడి నీడ స్పష్టంగా కనిపించింది.నేటికీ జగన్నాధునికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పండితులు తమ అరచేతుల్లో నీళ్లు పెట్టుకుంటారని చెబుతున్నారు.
ఆ సమయంలో పండితుల అరచేతిలో ఉన్న నీటిలో జగన్నాధుని విగ్రహం నీడ స్పష్టంగా కనిపిస్తుంది.ఇలా నీడ కనిపించినప్పుడే జగన్నాథుడు నైవేద్యాన్ని స్వీకరించినట్లు భక్తులు భావిస్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.