ఆంద్రప్రదేశ్
వైఎస్సార్సీపీలో చేరిన అందుకూరు టీడీపీ నాయకులు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
నారద వర్తమాన సమాచారం:పెదకూరపాడు:ప్రతినిధి
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. క్రోసూరు మండలం అందుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు
నల్లగొండ రాజేష్,
బెల్లంకొండ రాజశేఖర్,
చిలక మరియాదాసు,
చదలవాడ ఆదాం
తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.