

నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
రాజుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ
ఈ కార్యక్రమం లో కన్నా మాట్లాడుతు.. మనందరి లక్ష్యం ఒక్కటే ఈ సైకో పాలనను తరిమి కొట్టి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడిపించే తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం. దానికోసం మనందరం కలిసికట్టుగా విభేదాలకు తావివ్వకుండా పనిచేయాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం మత కులాలను రెచ్చగొట్టే విధ్వంసకర ప్రచారాలు చేస్తుందని. దానికి మనందరం దీటుగా సమాధానం ఇవ్వాలని. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేస్తామో ప్రతి గడపకి వెళ్లి వివరించాలని తెలియజేశారు.సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నన్ను నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు..
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ, మండల,తెలుగుదేశం, జనసేన, బిజెపి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







