
నారద వర్తమాన సమాచారం:అచ్చంపేట:ప్రతినిధి:
వైఎస్సార్సీపీలో చేరిన కొండూరు టీడీపీ కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అచ్చంపేట మండలం కొండూరు గ్రామానికి చెందిన టీడీపీ కుంభ పెద్దరామ్ కోటి, కుంభ నాగరాజు, కుంభ శీను, కుంభ గోపి, కుంభ వెంకయ్య, కుంభ శీను, కొజ్జా శీను,కొజ్జా మాస్, కుంభ రామాంజనేయులు. తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.








