Tuesday, April 28, 2026
spot_img

పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

నారద వర్తమాన సమాచారం

పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

టెలికాన్ఫరెన్సులో పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు.

పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా.

రాత్రంతా లోడ్ డిస్పాచెస్ జరిగాయని… నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని చెప్పిన అధికారులు.

ఇవాళ ఉదయం ఆరు గంటల సమయానికి 1402 లోడ్లు డిస్పాచ్ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపిన అధికారులు.

గత అర్థరాత్రి నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు 2173 కిలో లీటర్ల పెట్రోల్, 2846 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని తెలిపిన అధికారులు.

స్టాక్ లేని బంకుల సంఖ్య ఎంత మేర ఉందని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి… నిన్నటితో పోల్చుకుంటే గణనీయంగా తగ్గాయని చెప్పిన అధికారులు.

ప్రస్తుతం జిల్లాల నుంచి వస్తోన్న సమాచారం మేరకు ఉదయం 6 గంటల నాటికి 432 బంకులు మినహా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత ఉందన్న అధికారులు.

పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరేంత వరకు నిరంతరం మానిటర్ చేస్తూనే ఉండాలని సీఎం ఆదేశం.

క్యూలైన్లు లేకుండా చూడాలన్న సీఎం.. అవసరమైతే టోకెన్, స్లాట్ సిస్టంలను అవలంభించాలని ముఖ్యమంత్రి సూచన.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading