
పెన్షన్‌లు పంపిణీ చేయలేక చేతగానితనంతో చంద్రబాబు పై బురదజల్లుతున్న జగన్ పార్టీని ప్రజలు పారదోలాలి
పెదకాకాని టిడిపి నేతల ధ్వజం :
జగన్ మోహన్ రెడ్డి పెన్షన్‌లు సకాలంలో పంపిణీ చేయలేక చేతగానితనంతో చంద్రబాబు పై బురదజల్లే వ్యాఖ్యలు చేయడాన్ని పెదకాకాని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు.ఈ సంధర్భంగా టిడిపి రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్ మాట్లాడుతూ గత నెల 28 వ తేదీన సాక్షి పత్రికలో ఏప్రిల్ నెల ఫించన్ 3 వతారీఖు నుండి పంపిణీ అని ప్రకటన చేసి ఈ రోజు చంద్రబాబు కారణం అని జగన్ మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని గతంలో రాజధాని నిర్మాణం చేయలేక పరిశ్రమలు తేలేక చేతగానితనాన్ని చంద్రబాబు మీద చూపినట్లుగా పెన్షన్ పంపిణీ ఆలస్యానికి నైతిక బాధ్యత వహించాల్సిందిపోయి జగన్ మోహన్ రెడ్డి సిగ్గులేకుండా చంద్రబాబు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని 5 ఏళ్ళుగా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను ఫూల్స్ చేస్తున్న వైసిపి నేతలందరూ
రేపు ఎన్నికల్లో ఓడిపోయి పెద్ద ఫూల్స్‌గా మిగిలిపోవడం ఖాయమన్నారు.మండల టిడిపి అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకున్న జగన్ మోహన్ రెడ్డికి వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడంతో ఓర్వలేక అక్కసుతో పెన్షన్ దొంగాటతో చంద్రబాబు పై పేటియం బ్యాచ్‌లతో దుష్ప్రచారాలు చేస్తున్నారని కాంట్రాక్టర్లకు జగన్ అనూయనులకు వేల కోట్లు బిల్లులు చెల్లించుకుని రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి పెన్షన్ పంపిణీ నగదు లేక చంద్రబాబు పై దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.పొన్నూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఆత్మకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్ మాయమాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు
మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కూచిపూడి రాజేష్ మాట్లాడుతూ కోడికత్తి డ్రామాలు గొడ్డలి పోటు డ్రామాలు మాదిరిగా జగన్ మోహన్ రెడ్డి కొత్తగా పెన్షన్ డ్రామా మొదలుపెట్టినా ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
మండల టిడిపి నేతలు లింగంగుంట సాల్మన్ రాజు,మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు బెజ్జం గోపాలకృష్ణ,మండల టిడిపి నేతలు కోలాటపు మాణిక్యరావు, ఎస్సీ సెల్ నేతలు రాచపూడి మరియదాసు, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ రషిద్,సంకూరు యోహాను,జొన్నకూటి అనీల్,దావీదు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.