
చిన్నారి పుష్పాలంకరణ వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .
నారద వర్తమాన సమాచారం: ఇబ్రహీంపట్నం: ప్రతినిధి:
మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చిన్నారికి పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దొంతమాల బాబు , బేబీ . కుమార్తె చిన్నారి సింధుకు పుష్పాలంకరణ వేడుకలు గురువారం ఆయన స్వగృహంలో జరిగాయి.
ఈ సందర్భంగా వారి నివాసానికి విచ్చేసిన తెదేపా ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చిన్నారి సింధుని ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.