Sunday, June 14, 2026
spot_img

ఆపదలో అండగా నిలిచిన.. ‘విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్’

నారద వర్తమాన సమాచారం

ఆపదలో అండగా నిలిచిన.. ‘విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్’

సమాజంలో కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వడమే నిజమైన మానవత్వం. పరోపకారం ఇదం శరీరం అను స్ఫూర్తితో, విశ్వబ్రాహ్మణ కులదీపకులు, ఆపద్భాందవుడు బ్రహ్మశ్రీ కమ్మరిపల్లి కిరణ్ కుమార్ హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ACP నేతృత్వంలో, విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకుంది. పంజాగుట్టలోని డా. నాగార్జున  కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వివిధ రకాలుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ మరియు విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్  అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఇడుకోజు వెంకటాచారి ముఖ్య అతిథిగా విచ్చేసి, తమ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారి ఔదార్యం మరియు సామాజిక బాధ్యత అందరికీ ఆదర్శనీయం.

ఈ సేవా కార్యక్రమం వివరాలు:

విద్యార్థులకు విద్యా సహాయం:  రాచకొండ నరేంద్ర చారి  అక్క పిల్లలకు (ఇంటర్ మరియు 9వ తరగతి విద్యార్థులకు) పుస్తకాలు మరియు రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 7,640/- ఆర్థిక సాయం అందించారు.

ఆపదలో అండగా: షార్ట్ సర్క్యూట్ వల్ల షాపులోని ఫర్నిచర్, మిషనరీ కోల్పోయి నష్టపోయిన వడ్రంగి తాడిపల్లి సంతోష్ కి, జీవనోపాధి కోసం రూ. 50,000/- ఆర్థిక సాయం అందజేశారు.

స్వయం ఉపాధి కల్పన: సి. నరేందర్ సహకారంతో, శ్రీమతి బి. చంద్రిక కి కుట్టు మిషన్ (motorised sewing machine) అందజేయడం జరిగింది.

వైద్య సహాయం: కాలేయ మార్పిడి చికిత్స పొందుతున్న శ్రీరామదాసు సంపత్ కుమార్  కుమారుని వైద్య అవసరాల కోసం రూ. 50,000/- ఆర్థిక సహాయం అందించారు.

ఈ గొప్ప కార్యక్రమంలో విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు  బంగారు తాతరావు ప్రసాద్  మరియు విశ్వకర్మ సంఘం నాయకులు దయానందాచారి  కృష్ణమాచారి  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో కమ్మరిపల్లి మల్లిఖార్జున కిరణ్ కుమార్  చూపుతున్న చొరవ, సేవాతత్పరత అభినందనీయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని, మరిన్ని కుటుంబాలకు భరోసా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading