జి.కొండూరు మండలంలో పలు గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.
నారద వర్తమాన సమాచారం జి కొండూరు ప్రతినిధి.
మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలంలో పలు గ్రామాల వైసీపీ నాయకులతో సుదీర్ఘమైన అతి ముఖ్యమైన సమావేశాలు జరపటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్నాల తిరుపతిరావు. వైఎస్ఆర్సిపి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని. గెలుపు కొరకు జి.కొండూరు మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. మైలవరం గడ్డ వైసిపి అడ్డాగా మారాలని జగనన్నకు గిఫ్టుగా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు .ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకులు జి.కొండూరు జడ్పిటిసి సభ్యులు మందా జ క్రధరరావు (జక్రి)జి.కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ. వైసిపి సీనియర్ నాయకులు కాజా బ్రహ్మయ్య. వేములకొండ రాంబాబు. వేములకొండ సాంబయ్య. మొదలగువారు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.