
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
పాక్ లోకి వచ్చి మరీ చంపేస్తాం: రాజ్ నాథ్
సింగ్
భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు యత్నించి
పారిపోయిన వారిని వదిలిపెట్టేది లేదని రక్షణ
మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. అలాంటి
ఉగ్రవాదులు పాకిస్థాన్కు పారిపోయినా వారిని
ఏరివేసేందుకు పాల్లోకి ప్రవేశిస్తామని అన్నారు.
పొరుగు దేశాలతో సత్సంబంధాలను
కొనసాగించాలని భారత్ ఎల్లప్పుడూ
కోరుకుంటుందన్నారు. పదే పదే కవ్విస్తూ ఉగ్రవాద
కార్యకలాపాలను ప్రోత్సహిస్తే మాత్రం విడిచిపెట్టే
ప్రసక్తేలేదన్నారు.







