Thursday, December 12, 2024

పేద మహిళలకు చీరలు పంపిణీ రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబం దాతృత్వం.

పేద మహిళలకు చీరలు పంపిణీ రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబం దాతృత్వం.

జి నారద వర్తమాన సమాచారం:జి కొండూరు : ప్రతినిధి .

జి .కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన ఎస్.కే బాబుఆయన సతీమణి మల్లికా బేగం కుటుంబ సభ్యులు ముస్లిం సోదరుల పర్వదినమైన రంజాన్ సందర్భంగా ముందుగా పేదలైన మహిళలకు శనివారం ఉదయం చీరలను పంపిణీ చేశారు. ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ పర్వదినం సందర్భంగా సతామి లో భాగంగా ఖురాన్ ప్రకారం జాకాత్ సూక్తు లో భాగంగా ఆత్కూరు,
హెచ్ ముత్యాలంపాడు, కందులపాడు, వెలగలెరు,
కొత్తూరు తాడేపల్లి ,
గ్రామాల కు చెందిన 150 మంది పేద వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు, చీరలను పంపిణీ చేశారు .గత కొన్ని
ఏ ళ్లు గా రంజాన్ సందర్భంగా పేదలకు చీరలను పంపిణీ చేయటం వలన తమ కుటుంబానికి ఎంతో ఆనందం కలుగుతుందని నిర్వాహకులు ఎస్.కే బాబు, మల్లికా బేగం కుటుంబ సభ్యులు పేర్కొన్నారు .అల్లా దయవల్ల ప్రపంచ శాంతి కలగాలని
ఆ ముస్లిం కుటుంబం కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading